News September 21, 2025
GWL: పేదరికం జయించి.. మెడికల్ సీట్లు సాధించి

భవిష్యత్తులో స్థిరపడాలంటే చదువు చాలా ముఖ్యమని పెరేంట్స్ చిన్నప్పటి నుంచి పదే పదే చెప్పడం, వారి ఆశయాలను నెరవేర్చాలని సంకల్పంతో మెడికల్ సీట్లను చాలామంది విద్యార్థులు సాధించారు. పేదరికాన్ని జయించి సత్తా చాటుకున్నారు. మానోపాడు మండలంలో ముగ్గురు మెడికల్ సీట్లు సాధించారు. జల్లాపురం రక్షిత (మంచిర్యాల) కొర్విపాడు ఎండీ షాహిద్ బాషా (వరంగల్) నారాయణపురం పల్లి జ్ఞానేశ్వర్ రెడ్డి సంగారెడ్డిలో సీట్లు సంపాదించారు.
Similar News
News September 21, 2025
శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
News September 21, 2025
పరకామణి కేసు లోక్ అదాలత్‌లో రాజీ కాదా…?

రవికుమార్ పరకామణిలో దొంగతనం చేసి 2023 ఏప్రిల్‌లో పట్టుబడ్డారు. ఆయనపై పోలీసులు సెక్షన్ 379, 381 కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌లో 379 దొంగతనం కేసు కాగా, సెక్షన్ 381లో యజమాని ఆస్తిని క్లర్క్, ఇతర ఉద్యోగులు దొంగిలించడం ద్రోహం అని చట్టం చెబుతోంది. ఇదే అంశాన్ని CRPC సెక్షన్ 320 క్లాస్ 2 అనుగుణంగా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే వీలు లేదని చట్టాలు చెప్తున్నాయి. ఈ కేసు విషయం CBCID దర్యాప్తులో తేలనుంది.
News September 21, 2025
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.