News January 27, 2025
GWL: పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు: SP

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించి 4, ప్లాటు ఆక్రమణకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు సూచించారు. ప్రజావాణి ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు.
Similar News
News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్‌గడిమలక్‌పేట, మజీద్‌పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.
News March 14, 2025
HYD: 5K రన్‌కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్‌కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్‌ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.