News April 12, 2025
GWL: పోషకాహార లోపనివారణకు కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు పుట్టినరోజు వరకు 1000 రోజుల కాలంలో పోషకాహారంపై దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని చెప్పారు. మిల్లులకు చేరిన లోడును తడవక ముందే వెంటనే దింపుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు.
News November 4, 2025
సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా వసంతరావు

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా పనిచేస్తున్న వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు.


