News November 17, 2025

GWL: ప్రజావాణికి 106 ఫిర్యాదులు..!

image

గద్వాల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 106 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన దరఖాస్తులలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News November 17, 2025

రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

image

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

image

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.