News November 3, 2025
GWL: ప్రజావాణికి 132 ఫిర్యాదులు

గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 60 దరఖాస్తులు అందాయని చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News November 4, 2025
రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోతోపాటు కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.