News September 23, 2025
GWL: ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ

ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలు 3, కుటుంబ తగాదాలు 4, గొడవలు 3, ప్లాటు, ప్రభుత్వ ఉద్యోగం, విదేశాలకు పంపే అంశాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయన్నారు. ఇతర అంశాలపై 3 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
నేడు ‘ముద్దపప్పు బతుకమ్మ’.. ఎలా చేస్తారంటే?

తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. ఇవాళ ‘ముద్దపప్పు బతుకమ్మ’ను 3 వరుసల్లో చామంతి, మందార, రామబాణం పూలతో పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను తయారుచేసి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సాయంత్రం మహిళలు, పిల్లలు పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఇతరులకు ప్రసాదం పంచిపెడతారు. ఆపై బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
News September 23, 2025
NLG: బతుకమ్మ వేడుకలపై పోలీసుల నిఘా

బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.
News September 23, 2025
CELలో 46 పోస్టులు

ఘజియాబాద్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 46 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ నెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in/