News February 26, 2025
GWL: ఫేక్ సర్టిఫికెట్ల సూత్రధారి అరెస్ట్.!

ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మిర్యాలగూడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యవసాయ శాఖలో ఏఈవోలుగా ఫేక్ సర్టిఫికెట్లతో కొంతమంది పని చేశారని వారితో పాటు సర్టిఫికెట్ల సూత్రధారిని అరెస్టు చేశామని తెలిపారు.
Similar News
News February 28, 2026
కొత్తచెరువు: హంద్రీనీవా కాలువలో కొట్టుకు వచ్చిన వృద్ధుల మృతదేహాలు

కొత్తచెరువు మండలంలో చర్ల సమీపంలో హంద్రీనీవా కాలువలో వృద్ధుల మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎవరో గుర్తు తెలియని వృద్ధ దంపతులు అయ్యి ఉంటారని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధ మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదవశాత్తు కాలవలో పడ్డారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
News February 28, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి షాకిచ్చాయి. HYD మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.3,160 పెరగగా తాజాగా రూ.3,980 వృద్ధిచెంది రూ.1,68,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు మార్నింగ్ రూ.2,900 ఎగబాకగా, ఇప్పుడు రూ.3,650 పెరిగి రూ.1,54,650గా ఉంది. KG వెండిపై ఉదయం రూ.5వేలు, ఇప్పుడు రూ.20వేలు పెరిగి రూ.3,20,000కు చేరింది. శుభకార్యాలయాల వేళ ధరల పెరుగుదల సామాన్యులను కంగారుపెడుతోంది.
News February 28, 2026
IOCL 144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


