News October 6, 2025
GWL: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి: SP

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 12 అర్జీలు వచ్చాయన్నారు. భూ వివాదాలకు సంబంధించి 6, గొడవకు సంబంధించి 1, కొడుకులు పట్టించుకోవడంలేదని 1, ప్లాట్ భూకబ్జాకు సంబంధించి 2, అప్పు తీసుకొని ఇవ్వడం లేదని 1, ఇతర అంశాలకు సంబంధించి 1, మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
Similar News
News October 7, 2025
NTR జిల్లాకు 8 అవార్డులు

స్వచ్ఛాంధ్ర పురస్కారాలు-2025లో జిల్లాకు రికార్డు స్థాయిలో ఎనిమిది రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
News October 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➲జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్
➲SKLM: పీజీఆర్ఎస్‌కు 104 దరఖాస్తులు
➲వంశధార,నాగావళి నదులకు తప్పిన వరద ముప్పు
➲అధికారులతో పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
➲ఎచ్చెర్ల: జగనన్న కాలనీలో సదుపాయాలు ఏవీ?
➲టెక్కలి: 50వేలు గాజులతో లలితాత్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు అలంకరణ
➲ గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన మంత్రి అచ్చెన్న
➲అరసవల్లి: ఆదిత్యుని ఆదాయం రూ.5.9 లక్షలు
News October 7, 2025
HYD: రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దు: వీహెచ్

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అయినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దన్నారు.