News August 26, 2025

GWL: ‘మండపాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి’

image

గణేష్ మండపాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎలాంటి అపశృతి జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గణపతి దర్శనానికి వచ్చే మహిళలపై ఈవ్ టీజింగ్ జరగకుండా జాగ్రత్త వహించాలని, డీజేలు వాడరాదని, రాత్రి లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News August 27, 2025

TODAY HEADLINES

image

* బిహార్: రాహుల్ యాత్రలో పాల్గొన్న CM రేవంత్
* బ్యాంకులు ప్రజలను నియంత్రించొద్దు: సీఎం చంద్రబాబు
* APSRTC ఉద్యోగుల ప్రమోషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్
* యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్ సింగ్
* రేవంత్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్
* రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు: కేటీఆర్
* పెరిగిన బంగారం ధరలు

News August 27, 2025

‘త్రిపుర’కు ఆడనున్న విహారి.. YCP ప్రశ్నలు!

image

దేశవాళీ క్రికెట్‌లో ఇక నుంచి తాను త్రిపుర జట్టుకు ఆడబోతున్నట్లు AP క్రికెటర్ హనుమ విహారి ప్రకటించారు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నా ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతించే వేదిక కోసమే ఈ మార్పు’ అని పేర్కొన్నారు. దీనిపై YCP స్పందిస్తూ ‘గతంలో YCP ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విహారి ఇప్పుడెందుకు విసుగు చెందాడు? అతనికి ఎవరు అవకాశాలివ్వట్లేదు?’ అని ప్రశ్నించింది.

News August 27, 2025

చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే వినాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు.