News February 9, 2026

GWL: మహాశివరాత్రికి స్పెషల్ బస్సులు: DM సునీత

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గద్వాల నుంచి శ్రీశైలం, అలంపూర్ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు గద్వాల డిపో మేనేజర్ సునీత సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న శ్రీశైలానికి 10 బస్సులు, 15న 20 బస్సులు,16న 10 బస్సులు నడుపుతామన్నారు. అలాగే అలంపూర్‌కు 14న 6 బస్సులు, 15న 10 బస్సులు, 16న 6 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అవకాశాన్ని నడిగడ్డ భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 13, 2026

తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

image

తొర్రూర్ మున్సిపాలిటీలోని ​9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ​ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.

News February 13, 2026

T20WC: USA భారీ స్కోర్

image

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.