News April 4, 2025

GWL: మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సంతోష్

image

గద్వాల జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సంతోష్ డాక్టర్లకు సూచించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. మహిళలు, చిన్నపిల్లలు, పురుషుల వార్డుల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యం అందుకున్న తీరు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు.

Similar News

News December 14, 2025

తూ.గో జిల్లాలో పులి కలకలం

image

గోపాలపురం మండలం భీమోలు మెట్టపై పులి సంచరిస్తోందన్న ప్రచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి, రెండు పిల్లలు కనిపించాయని రైతు రామకృష్ణ ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం పాదముద్రల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. నిఘా కోసం ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News December 14, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

✦ ‘పాలమూరు’ ఫేజ్-1కి అనుమతులు ఇవ్వాలని, ఏపీ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
✦ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
✦ తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం (67) కంటే మహిళలదే (73) ఎక్కువ.. ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ 2022 డేటా ఆధారంగా నివేదిక ఇచ్చిన కేరళ వర్సిటీ

News December 14, 2025

వికారాబాద్: తొలగనున్న కేజీబీవీ విద్యార్థుల కష్టాలు

image

VKB జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి. చలికాలంలో విద్యార్థులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 17 KGBVలకు 2,748 బెడ్లు కావాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 KGBVలకు ప్రభుత్వం 2,130 బెడ్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే KGBVలకు బెడ్లు పంపిణీ చేయనున్నారు.