News November 15, 2025
GWL: రబీ సీజన్‌కు సాగునీరు ఇవ్వలేం- డిప్యూటీ సీఎం

కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాం పరిధిలోని ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీబీ డ్యాం పరిధిలోని ఆయకట్టు రైతులు సహకరించాలన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 15, 2025
వేములవాడలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

దక్షిణ కాశీ వేములవాడ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుసగా 25వ రోజు కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలతో ఆలయ ఆవరణ కాంతులీనింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆలయ ఈ రాజేష్, ఏఈఓ శ్రావణ్ ప్రసాదం, వాయనం అందజేశారు.
News November 15, 2025
రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
News November 15, 2025
చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


