News September 19, 2025
GWL: ‘రేవులపల్లిలో బ్రిడ్జి నిర్మించాలి’

రేవులపల్లి-నందిమల్ల మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి పరిసర గ్రామాల ప్రజలు కోరారు. కాంగ్రెస్ గద్వాల ఇన్‌ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 28న జూరాల సందర్శన సమయంలో బ్రిడ్జిని ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మీరు ప్రతిపాదించారని, ఇప్పుడు బ్రిడ్జిని మరోచోట నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని ఆయనకు వివరించారు.
Similar News
News September 19, 2025
SKLM: దివ్యాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన కేంద్ర మంత్రి

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.