News July 4, 2025

GWL: ‘రైతులకు న్యాయం చేసేందుకు సహకరిస్తాం’

image

భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా పరిహారం అందించేందుకు సహకరిస్తామని కలెక్టర్ సంతోశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో అయిజ మండలం జడదొడ్డి, బింగిదొడ్డి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిహారం పెంచే విధంగా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులతో చర్చిస్తామన్నారు.

Similar News

News July 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 5, 2025

విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చన్నారు.

News July 5, 2025

ప్రాథమిక విద్య నుంచే సైన్స్ వైపు మళ్లించాలి: కలెక్టర్

image

ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులను సైన్స్ వైపు మళ్లించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కొమరం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఇన్స్పైర్ శిక్షణా కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో పాల్గొన్నారు. సైన్స్ అనేది జీవన సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ఈ రోజుల్లో ప్రపంచమంతా సైన్స్ వైపు అడుగులు వేస్తుందని తెలిపారు.