News August 9, 2025

GWL: వాడవాడల రక్షాబంధన్ వేడుకలు

image

నడిగడ్డలోని గ్రామాలు, పట్టణాలు, వాడవాడలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్లు అన్నదమ్ములను కలిసి రాఖీలు కట్టారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయన సోదరి, NHPS జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి అన్నపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

Similar News

News August 9, 2025

నవీపేట్: రాఖీ కట్టుకొని వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి (అప్డేట్)

image

నవీపేట(M) <<17352294>>జగ్గారావు ఫారం సమీపంలో<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు బాసరకు చెందిన సాయిబాబుగా(19) పోలీసులు గుర్తించారు. అతను NZBలో ఉంటున్న తన అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి స్కూటీపై వెళ్తున్న క్రమంలో వేగంగా లారీని ఢీకొట్టాడు. దీంతో సాయిబాబు అక్కడికక్కడే మృతి చెందాడని SI తెలిపారు. స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

News August 9, 2025

తణుకులో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం తణుకులో నిర్వహించారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ క్రీడల పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అర్చరీలో జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు.

News August 9, 2025

NRPT: ‘కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి’

image

ప్రభుత్వ కార్యాలయాలు, గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి అల్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు.