News February 4, 2025

GWL: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 5, 2025

నల్గొండ: అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు

image

పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఫిబ్రవరి 10 తేది సాయంత్రం 7గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్‌ల నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే.జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. 

News February 5, 2025

NZB: కొక్కెర వ్యాధి వల్లే కోళ్ల మృత్యువాత

image

కొక్కెర వ్యాధి వైరస్ వ్యాధి వలన జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నిజామాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. వ్యాధి గ్రహిత కోళ్ల నమూనాలను నిర్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ వ్యాధి వలన మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం కలగదని పేర్కొన్నారు.

News February 5, 2025

లక్ష డప్పులతో కృష్ణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్లండి: డా.రవి

image

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపి అమలుపరిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.

error: Content is protected !!