News December 19, 2025

GWL: విపత్తులు ఎదుర్కొనే అవగాహన కలిగి ఉండాలి-CS

image

వరదలు ప్రమాదాలతో పాటు వివిధ రకాల విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి అవగాహన ఉండాలని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. NDMA డైరెక్టర్ సుధీర్ బాల్, టీజీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణ రావుతో కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల జిల్లా యంత్రాంగం విపత్తుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

Similar News

News December 20, 2025

స్టార్‌బక్స్‌ CTOగా భారత సంతతి వ్యక్తి ఆనంద్‌ వరదరాజన్

image

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్‌బక్స్‌ తమ కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన ఆనంద్‌ వరదరాజన్‌ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్‌లో పనిచేశారు. అక్కడ గ్లోబల్‌ గ్రోసరీ బిజినెస్‌కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్‌ హెడ్‌గా పనిచేశారు. ఒరాకిల్‌లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. IIT నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్‌ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్‌ చేశారు.

News December 20, 2025

NGKL: బాల్య స్నేహితులు.. సర్పంచ్‌లుగా గెలిచారు

image

ఒకేచోట చదువుకున్నారు.. ప్రాణ స్నేహితులుగా పెరిగారు.. పెళ్లిళ్ల తర్వాత వేర్వేరు గ్రామాలకు కోడళ్లుగా వెళ్లారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు చెరో గ్రామానికి సర్పంచులు అయ్యారు. బల్మూరు(M) పోలిశెట్టిపల్లికి A.జ్యోష్ణ కాంగ్రెస్, తెల్కపల్లి(M) పర్వతాపూర్ కోడలు కొట్ర ప్రసన్న రెడ్డి BRS సర్పంచులుగా గెలుపొందారు. ఇంటర్ వరకు కలిసి చదివిన స్నేహితులు సర్పంచ్‌లు కావడంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

News December 20, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. ప్రభావం చూపని BJP!

image

ఉమ్మడి NLG జిల్లాలో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ BJP కనీస ప్రభావం చూపించలేక పోయిందన్న టాక్ వినిపిస్తోంది. BJP కంటే అధికంగా జిల్లాలో స్వతంత్రులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లాలో 1,779 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు 1,136స్థానాలు వచ్చాయి. BRSకు 475, CPI, CPM ఇతరులకు 145స్థానాలు రాగా BJPకి 22 వచ్చాయి. కాగా ఇతరుల్లో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉన్నారు.