News September 20, 2025
GWL: సరిపోల్చే ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

2002, 2025 ఓటర్ జాబితా సరిపోల్చే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఓటరు జాబితా సరి పోల్చడంలో రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పరిశీలించాలన్నారు. జాబితా పరిశీలన సులువుగా ఉండేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించామని చెప్పారు. సెప్టెంబర్ 23 వరకు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
Similar News
News September 20, 2025
మిల్లర్లతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

గత సీజన్లలో సీఎంఆర్ పూర్తి చేసి ఉండి, ఇపుడు బ్యాంకు గారంటీలు సమర్పించిన మిల్లర్లకే 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కేటాయించడం జరుగుతుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డీఫాల్టర్‌లకు పెండింగ్ పూర్తి చేస్తేనే కొత్తగా ధాన్యం కేటాయించడం జరుగుతుందన్నారు.
News September 20, 2025
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు: మంత్రి కొండపల్లి

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ హేతుబద్ధీకరణతో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఉపశమనం లభిస్తుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఎఈ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక అధికారులను నియమిస్తామన్నారు.
News September 20, 2025
HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.