News September 8, 2025
GWL: సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి- SP

సైబర్ వారియర్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో DSP మొగిలయ్యతో సైబర్ వారియర్స్, D4C సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లా సైబర్ సెల్‌తో సమన్వయం చేసుకొని సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద కంటెంట్‌పై నిఘా ఉంచాలని, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
Similar News
News September 10, 2025
ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడి దురదృష్టకరం: ట్రంప్

ఖతర్‌పై ఇజ్రాయెల్ <<17661181>>దాడి<<>> చేయడం దురదృష్టకరమని US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘ఇది ఇజ్రాయెల్ PM నెతన్యాహు నిర్ణయం. నాది కాదు. హమాస్‌ను అంతం చేయడం విలువైన లక్ష్యమే కానీ ఖతర్‌పై దాడి చేయడం వల్ల ఆ లక్ష్యం ముందుకు సాగదు. మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వను. ఈ యుద్ధం ముగిసిపోవాలి. నెతన్యాహు కూడా శాంతిని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. ఖతర్‌పై దాడికి ట్రంప్ మద్దతివ్వలేదని అంతకుముందు వైట్ హౌస్ ప్రకటించింది.
News September 10, 2025
శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
News September 10, 2025
నేడు అనంతపురానికి CM చంద్రబాబు

★ నేడు మ.12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం బయలుదేరుతారు
★ మ.1.30కి అనంతపురం చేరుకుంటారు
★ అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక ఉండవల్లికి తిరుగుపయనం
▶ అనంతపురానికి సీఎం, డిప్యూటీ సీఎం, కూటమి ఎమ్మెల్యేలందరూ వస్తుండటంతో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.