News February 20, 2025
GWL: ‘స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉండాలి’

ఎన్నికల సామాగ్రి ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లో పటిష్ట భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్‌ను బుధవారం పరిశీలించారు. అక్కడి రికార్డులను పరిశీలించి, సీసీ కెమెరాలు పని చేసే విధానం గురించి ఆరా తీశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సాధారణ తనిఖీలు నిర్వహించామని చెప్పారు. తహశీల్దార్ మల్లికార్జున్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
పల్నాడు: జిల్లాలో 7 కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం!

పల్నాడు జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఏడు కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు ఏపీ సీపీడీసీఎల్ విజయవాడ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు. గురువారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ అంతరాయం కలగకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై చర్చించారు.
News February 19, 2026
రూ.20 లక్షల ఉద్యోగం వస్తేనే అభిషేకం.. విద్యార్థి లేఖ వైరల్

AP: ఏలూరు(D) తాడువాయిలోని శ్రీభద్రకాళి వీరేశ్వరస్వామి ఆలయ హుండీలో ఓ విద్యార్థి వేసిన లేఖ వైరలవుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తనకు 9CGPA మార్కులు, తర్వాత ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరాడు. అప్పుడు అభిషేకం చేయించి బట్టలు ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ కుర్రాడు దేవునితో డీల్ మాట్లాడుకున్నాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
News February 19, 2026
కృష్ణా: బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు!

ఉమ్మడి కృష్ణాలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఎక్సైజ్, సివిల్ పోలీసులకు నెలకు రూ.70-80 వేల వరకు మామూళ్లు అందుతుండటంతోనే వీటిపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటం గమనార్హం. NTR, కృష్ణా జిల్లాల్లోని వైన్ షాపులు, బార్ల నుంచి కూడా భారీగా వసూళ్లు జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


