News September 22, 2025

GWL: హోంగార్డులకు రెయిన్ కోట్ల అందజేత

image

గద్వాల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులకు ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లు, ఉలన్ జాకెట్లు అందజేశారు. పోలీసులతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డీజీపీ కార్యాలయం నుంచి రైన్ కోట్లు పంపిణీ చేశారని తెలిపారు. హోంగార్డులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన తనను సంప్రదించాలన్నారు. AR DSP నరేంద్ర రావు పాల్గొన్నారు.

Similar News

News September 22, 2025

‘విజయవాడ ఉత్సవ్‌’కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

AP: నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ <<17789445>>ఉత్సవ్‌కు<<>> సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గ గుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లీజ్‌కు తీసుకున్న వారికి, ఆలయానికి సమస్య లేనప్పుడు మూడో వ్యక్తికి అభ్యంతరమేంటని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

News September 22, 2025

మ‌హిళా సైంటిస్టులకు ఓ పథకం

image

ప్ర‌తిభావంతులైన మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (WISE-KIRAN) ప‌థ‌కం అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు నెలకు రూ.50 వేల గౌర‌వవేత‌నం, HRA స‌దుపాయాలు క‌ల్పించి, వారి ప్రాజెక్టు కోసం రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పీజీ పూర్తిచేసి, 27-60 ఏళ్లున్న మహిళలు అర్హులు. రెగ్యుల‌ర్ ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లకు ఈ ప‌థ‌కం వర్తించదు.

News September 22, 2025

KNR: అమ్మవారి దీక్ష తీసుకున్న కేంద్రమంత్రి బండి

image

దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా KNR శ్రీ మహాశక్తి దేవాలయంలో KNR MP, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం అమ్మవారి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆయన మాలధారణ చేశారు. కాగా, దీక్ష స్వీకరించిన రోజునుంచి నవరాత్రులు ముగిసే వరకు ఆయన మహాశక్తి ఆలయంలోనే ఉంటారు. ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ దుర్గమ్మ సేవలో తరిస్తారు. ఈ 9 రోజులపాటు ఏ రాజకీయ కార్యక్రమాల్లో MP పాల్గొనరు.