News September 1, 2025
GWL: 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు: DAO

గద్వాల జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణలో సన్న, చిన్న కారు రైతులకు 50 శాతం సబ్సిడీతో వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాకు రూ.2.24 కోట్లు నిధులు కేటాయించి 2,703 యూనిట్ల పనిముట్లు మంజూరు చేసిందన్నారు. పథకానికి SC, ST మహిళా రైతులు, చిన్న, సన్న కారు రైతులు అర్హులన్నారు. ఆసక్తి గల రైతులు ఏవోలను సంప్రదించాలన్నారు.
Similar News
News September 4, 2025
ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.
News September 4, 2025
OU బీఫార్మసీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఫార్మసీ(పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజు స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15లోగా ఫీజులను సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News September 4, 2025
MNCL: 5, 6 తేదీల్లో కార్మికుల సమ్మె

ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ అధికారికి ఆయన సమ్మె నోటీస్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.