News October 13, 2025

GWL: CPR పై అవగాహన కలిగి ఉండాలి- కలెక్టర్ సంతోష్

image

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారని చెప్పారు. ఈనెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 13, 2025

జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

image

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.

News October 13, 2025

మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

image

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.

News October 13, 2025

మంచిర్యాల: నల్ల జెండాలతో నిరసన

image

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్లజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారతదేశం మీద దాడి జరిగినట్టే అన్నారు. దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.