News March 4, 2025
GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.
Similar News
News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.
News March 5, 2025
వరంగల్ జిల్లాలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

అప్పుల భారం భరించలేక పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామానికి చెందిన సాంబారి రాజు తన అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక సోమవారం ఏదో పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందగా మంగళవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 5, 2025
ఇవాళ జగన్ ప్రెస్ మీట్

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, వైసీపీ నేతల అరెస్టులపై ఆయన మాట్లాడనున్నారు.