News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News April 4, 2025
KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News April 4, 2025
జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
News April 4, 2025
సిద్దిపేట: రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో గల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐకేపీ సెంటర్‌లలోనే వరిధాన్యం కోనుగోలుకు అవసరమైన పాడి క్లీనర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.