News February 22, 2025
GWL: ‘తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి’

రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టరేట్‌లో త్రాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితీలో మున్సిపల్ పరిధిలో నీటి సరఫరాను మెరుగు పరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 23, 2025
మయన్మార్‌లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు

మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన వబ్బలరెడ్డి మణికంఠతో పాటు మరో ముగ్గురు యువకులు ఉపాధి నిమిత్తం మయన్మార్ వెళ్లారు. అక్కడ సరైన పని కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నా కుదరలేదు. విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను సంప్రదించి ఆ యువకులను స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 23, 2025
హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్‌లకు ఆహ్వానించింది.
News February 23, 2025
ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.