News February 6, 2025
GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738840774046_52038834-normal-WIFI.webp)
గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.
Similar News
News February 7, 2025
కడెం: ఉరేసుకొని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738856541366_51420205-normal-WIFI.webp)
వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. కడెం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్ పేట్ గ్రామానికి చెందిన కటికనపెల్లి నాగన్న (49) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News February 7, 2025
కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852778525_51940040-normal-WIFI.webp)
కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News February 7, 2025
MNCL: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738858559987_50225406-normal-WIFI.webp)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.