News March 14, 2025
GWL: మరమ్మత్తుల కంటే.. కొత్త మోటర్లు బెటర్.!

GWL జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకు నీటి వసతి కల్పించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నాయి. వేసవి కాలం మొదలైతే నీటి వనరులు అడుగంటి మోటర్లు స్టార్టర్లు పనిచేయవు. పాత వాటికీ మరమ్మతులు చేయించిన కొన్ని రోజులకే పాడౌతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం పదే పదే రిపైర్స్ అయ్యే వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
News March 15, 2025
ధనికులుగా మారేందుకు హర్ష్ గోయెంకా చిట్కాలు

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారేందుకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా Xలో చెప్పిన టిప్స్ వైరలవుతున్నాయి.
* సంపదను సృష్టించే ఆస్తులను సంపాదించండి
* సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయండి
* ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి
* ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి
* సంపదను పెంచే అవకాశాలను చూడండి
* మనీ కోసమే కాకుండా నేర్చుకునేందుకు పనిచేయండి
News March 15, 2025
గ్రూప్-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.