News February 26, 2025
GWL: ‘విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల కేసులు అన్ని కోణాల్లో విచారించాలని, అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.
News February 26, 2025
ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో?: BRS

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్‌కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.
News February 26, 2025
MLC ఎన్నికకు 233 మంది పోలీస్ బందోబస్త్: ఎస్పీ

జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనుండగా.. 233 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పర్యటిస్తారన్నారు.