News February 4, 2025
GWL: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 5, 2025
నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.
News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు
నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.