News April 3, 2025

GWL: ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం’

image

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిర, వెంకట్రామమ్మ పేర్కొన్నారు. గురువారం గద్వాలలో జరిగిన అంగన్వాడీ వర్కర్ల సమావేశంలో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. కోశాధికారి లక్ష్మీ రంగమ్మ, ఉపాధ్యక్షురాలు గిరిజ, సభ్యులుగా చిట్టెమ్మ, కృష్ణవేణిని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారిని అభినందించారు.

Similar News

News April 10, 2025

IPLలో ఒకే ఒక్కడు

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా IPLలో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761) ఉన్నారు.

News April 10, 2025

నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి

image

AP: నర్సింగ్‌కు 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.

News April 10, 2025

సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే విషయంలో పోలీసులు కట్టెట్టమైన ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతరులు ఎవరు కూడా పరీక్ష కేంద్రాల్లో ఉండకూడదని ఆదేశించారు.

error: Content is protected !!