News February 14, 2025
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ FEB 18న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త CEC ఎంపిక కోసం PM మోదీ, లా మినిస్టర్ అర్జున్ మేఘ్వాల్, LOP రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. 480 మంది నుంచి సెర్చ్ కమిటీ ఐదుగురిని షార్ట్ లిస్టు చేయనుంది. ఈ జాబితాలో 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ జ్ఞానేశ్ కుమార్ ముందువరుసలో ఉన్నారు. ఈయన గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు.
Similar News
News October 21, 2025
నిలవాలంటే గెలవాల్సిందే..

WWCలో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. తర్వాతి 2 మ్యాచుల్లో(న్యూజిలాండ్, బంగ్లాదేశ్)పై గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. అలా కాకుండా NZపై ఓడిపోతే BANపై తప్పకుండా గెలవాలి. అదే సమయంలో NZ తన తర్వాతి మ్యాచులో ENG చేతిలో ఓడాలి. అప్పుడే భారత్ SF చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం IND, NZ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. AUS, SA, ENG ఇప్పటికే సెమీస్ చేరాయి.
News October 21, 2025
NCLTలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో లా రీసెర్చ్ అసోసియేట్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB/LLM, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.60వేలు (ఢిల్లీలో రూ.80వేలు). వెబ్సైట్: https://nclt.gov.in/
News October 21, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.