News August 2, 2024
GYMNASTICS: రియో ఒలింపిక్స్ నాటి మెరుపులు ఏవీ?

దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో మారుమోగిన పేరు ఇది. అత్యంత కష్టమైన ‘ప్రొడోనోవా’ను ఆమె సునాయసంగా చేసిన తీరుపై ప్రశంసలు కురిశాయి. కానీ ఈ మెరుపులు ఆ తర్వాత కొనసాగలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రణతి నాయక్ ప్రదర్శన నిరాశపర్చింది. ఈసారి ఒక్క జిమ్నాస్ట్ కూడా లేకపోవడం విచారకరం. వివిధ విభాగాల్లో 55 మెడల్స్ సాధించే అవకాశం ఉన్నా భారత్ ఈ క్రీడను ప్రోత్సహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News March 4, 2026
చెలరేగుతున్న న్యూజిలాండ్

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ విధ్వంసం సృష్టిస్తోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 84 రన్స్ చేసింది. సీఫర్ట్ (21 బంతుల్లో 41*), అలెన్ (15 బంతుల్లో 43*) బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరూ కలిసి 5 సిక్సర్లు, 9 ఫోర్లు బాదారు.
News March 4, 2026
ఖమేనీ రెండో కొడుకు ఆస్తి ఎంతో తెలుసా?

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఆయనకు బ్రిటన్‌లో 100 మిలియన్ పౌండ్ల విలువైన 11 ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా భారీగా ఆస్తులు, గోల్డ్ కూడబెట్టినట్లు నిపుణుల అంచనా. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో బ్యాంకులు, స్విస్ బ్యాంకులో ఖాతాలు, ప్రైవేట్ జెట్ ఉన్నాయని తెలుస్తోంది. <<19292894>>IRGC<<>>కి నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
News March 4, 2026
టమాటా రేట్ల పతనం.. ప్రభుత్వాలు ఇలా చేస్తే?

AP, TGలో టమాటా ధరలు కుప్పకూలిపోయాయి. కిలో ₹2-5కు కొనేందుకూ <<19258574>>వ్యాపారులు<<>> ముందుకు రావట్లేదు. దీంతో రైతులు వృథాగా పంటను పడేస్తున్నారు. ఇలా రేట్లు పడిపోయినప్పుడు టమాటాలతో పచ్చళ్లు, కెచప్/ప్యూరీ, టమాటా పొడి చేసుకునేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. టమాటా విస్తీర్ణం అధికంగా ఉండేచోట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఏర్పాటు చేయాలి. ఇతర పంటలకూ ఇలాగే ప్రత్యామ్నాయాలను చూపితే రైతులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఏమంటారు?


