News December 24, 2025
H.జంక్షన్‌లో మహిళ అనుమానాస్పద మృతి

H.జంక్షన్ లోని పశువుల సంత ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనంలో నివసిస్తున్న ఓ మహిళ బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ముఖానికి కవర్‌లు కట్టి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఘటనకు కారణమై ఉండొచ్చని చర్చ సాగుతోంది. మహిళ విజయనగరం, భర్త తిరువూరుకు చెందినవారు. ఘటన స్థలానికి క్లూస్ టీం, పెదపాడు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 31, 2025
గుంటూరులో పడిపోయిన గాలి నాణ్యత

గుంటూరులో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగళవారం AQI.in నివేదిక ప్రకారం, నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 229గా నమోదైంది. ఇది ‘సివియర్’ కేటగిరీ కిందకు వస్తుంది. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాలైన తెనాలి, బాపట్ల వైపు కూడా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 212 నుంచి 243 మధ్య నమోదైంది. చలి తీవ్రత పెరగడం, వాహనాల కాలుష్యం కారణంగా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News December 31, 2025
కామారెడ్డి జిల్లాలో స్థిరంగా ఉష్ణోగ్రతలు.. కానీ చలి తీవ్రం

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మేనూర్ 10.2°C, జుక్కల్ 10.4, గాంధారి 10.7, రామలక్ష్మణపల్లి, పెద్దకొడప్గల్ 10.8, దోమకొండ, మాక్దూంపూర్ 10.9, లచ్చపేట 11, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, మాచాపూర్, తాడ్వాయి 11.1, సర్వాపూర్, ఎల్పుగొండ 11.2, పిట్లం 11.4, డోంగ్లీ 11.6, ఆర్గొండ, రామారెడ్డి 11.7°C ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 31, 2025
KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


