News December 22, 2025

H-1B షాక్: ఇండియాలో చిక్కుకున్న టెకీలు.. అమెరికా వెళ్లడం కష్టమే!

image

ఇండియా వచ్చిన H-1B వీసా హోల్డర్లకు సోషల్ మీడియా వెట్టింగ్ రూల్స్‌తో US షాకిచ్చింది. వేలమంది అపాయింట్‌మెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు ఒక్కసారిగా జులైకి మారిపోయాయి. దీంతో మనవాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఆఫీసుల నుంచి అన్‌పెయిడ్ లీవ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఎప్పుడొస్తారో తెలియక టెన్షన్ పడుతున్నాయి.

Similar News

News December 22, 2025

విశాఖ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖ జిల్లా ప్రజలు ఇకపై భవనాలు, ఖాళీ స్థలాల సర్వే సర్టిఫికెట్ల కోసం జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కమిషనర్ వినూత్న ఆలోచనతో రూపొందించిన ఆన్‌లైన్ విధానాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ప్రారంభించారు. ​www.gvmc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

News December 22, 2025

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు: మంత్రి సత్యకుమార్

image

APలోనే తొలిసారి 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులు, ఒంగోలులోని MCH, పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రులకు అందించినట్లు చెప్పారు. ‘JAN 1 నుంచి ఉచిత సేవలు మొదలవుతాయి. ఈ స్కాన్‌తో 18-22 వారాల గర్భస్థ శిశువు లోపాలను కనుగొనవచ్చు. గర్భిణులకు ₹4K చొప్పున ఆదా అవుతుంది’ అని తెలిపారు.

News December 22, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన కృష్ణప్ప గౌతమ్

image

IPL క్రికెటర్, కర్ణాటక ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. IPLలో MI, RR, PBKS, LSG, CSK జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ 37 ఏళ్ల ఆల్‌రౌండర్ 36 మ్యాచుల్లో 247రన్స్, 21వికెట్స్ సాధించారు. 59 ఫస్ట్ క్లాస్, 68 లిస్ట్-A మ్యాచుల్లో కలిపి 320వికెట్లు తీశారు. రంజీలో(2016-17) 8 మ్యాచుల్లో 27W, 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్-2019లో 56 బంతుల్లో 134 రన్స్ చేయడం ఆయన కెరీర్‌కే హైలైట్.