News December 22, 2025

H-1B Visa: ‘వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి’

image

H-1B, H-4 వీసాలకు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ కోరింది. ఆన్‌లైన్ నిఘాను కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. US ఎంబసీలు, కాన్సులేట్లు వీసా దరఖాస్తులను యథావిధిగా స్వీకరిస్తున్నాయని వెల్లడించింది. వెట్టింగ్‌గా పిలుస్తున్న కొత్త నిబంధన కారణంగా అమెరికా నుంచి వచ్చిన వేలాదిమంది ఇండియన్స్ ఇక్కడే చిక్కుకుపోయారు.

Similar News

News December 22, 2025

పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్‌లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

మే 12 నుంచి EAPCET

image

AP: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (CETs)-2026 షెడ్యూల్‌ను APSCHE విడుదల చేసింది. ఆయా సెట్ల పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
*EAPCET (Eng): 12, 13, 14, 15, 18
*EAPCET (agri, pharm): మే 19, 20
*ECET: ఏప్రిల్ 23
*ICET: ఏప్రిల్ 28
* LAW, EDCETs: మే 4
*PGECET: ఏప్రిల్ 29, 30, మే 2
*PGCET: మే 5, 8, 9, 10, 11

News December 22, 2025

GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

image

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.