News September 21, 2025
కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ

H1B వీసా <<17767574>>ఫీజు<<>> పెంపుపై వైట్‌హౌస్ సెక్రటరీ, ట్రంప్ సలహాదారు కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీసాలు ఉండి దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఏమీ ఛార్జ్ చేయట్లేదని చెప్పారు. వీసాదారులు ఎప్పటిలాగే దేశం విడిచినా, తిరిగొచ్చినా వారిపై కొత్త రూల్స్ ప్రభావం ఉండదని తెలిపారు. కొత్తగా వీసా తీసుకునే వారికే ఇది వర్తిస్తుందని తెలిపారు. ఇది వార్షిక ఫీజు కాదని, మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 21, 2025
90 శాతం సబ్సిడీతో పసుపు విత్తనాలు, పరికరాలు

AP: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు విత్తనాలు, సాగు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించనుంది. కేవలం 10 శాతం రైతులు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.93 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
News September 21, 2025
7,267 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS)లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి <
News September 21, 2025
గందరగోళంతో టెన్షన్ టెన్షన్

H1B వీసా ఫీజు పెంపుపై వైట్‌హౌస్ ముందే క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా మంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. శుభకార్యాలు, ఇతర పనుల కోసం ఇండియాకు వచ్చిన వారు హడావిడిగా అమెరికా వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ టికెట్ ధర రూ.34-37వేల నుంచి రూ.70-80 వేల వరకు పెరిగింది. అయితే ఇప్పటికే ఆ వీసా ఉన్నవారికి ఫీజు వర్తించదని కాసేపటి క్రితం అమెరికా ప్రభుత్వం <<17779352>>క్లారిటీ<<>> ఇవ్వడంతో లక్షల మంది ఊపిరి పీల్చుకున్నారు.