News December 31, 2024

H1B వీసా వివాదం: రంగంలోకి దిగిన కేంద్రం

image

అమెరికాలో H1B వీసాలు కలిగిన భారతీయులపై వ్యతిరేక పరిస్థితులను కేంద్రం పర్యవేక్షిస్తోంది. చట్టబద్ధంగా పనిచేస్తున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా IT, కామర్స్, విదేశాంగ శాఖలు రంగంలోకి దిగాయి. అక్కడి పరిణామాలను గమనిస్తున్నాయి. H1B వీసాల్లో మన కాంపిటీటివ్ పొజిషన్‌పై ప్రభావం పడకుండా చూడనున్నాయి. వలస విధానంపై ట్రంప్ అనుచరులు, మస్క్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

Similar News

News November 22, 2025

IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

image

<>IIT <<>>హైదరాబాద్‌లో 2 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: iith.ac.in

News November 22, 2025

కివీతో ఎన్నో లాభాలు

image

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.