News December 14, 2024
హ్యాకథాన్ -2024 విన్నర్ నూజివీడు IIIT
AP: నూజివీడు IIIT జాతీయ స్థాయిలో మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2024 విజేతగా నిలిచింది. దేశ వ్యాప్తంగా 25 జట్లు పాల్గొన్న ఈ పోటీలో ‘ఛేజింగ్ హారిజన్స్’ విద్యార్థుల జట్టు విజయం సాధించి రూ.లక్ష బహుమతి అందుకుంది. జట్టులోని సిద్ధార్థ, వినూత్న, మనోజ్, వెంకటేశ్, విశ్వదత్త, ఫర్హానాను ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య విజయ్ కుమార్ అభినందించారు.
Similar News
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
Stock Markets: నెగటివ్ సంకేతాలొచ్చినా లాభాల్లోనే..
దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,779 ( +40), సెన్సెక్స్ 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. BPCL, INDUSIND BANK, ONGC, HINDALCO, SHRIRAM FIN టాప్ గెయినర్స్. ASIANPAINT, NESTLE, TITAN, EICHER టాప్ లూజర్స్.
News February 5, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.