News June 17, 2024
EVMల హ్యాకింగ్.. మస్క్కు అవకాశం ఇవ్వాలన్న పురందీశ్వరి
AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్ను భారత్కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 2, 2025
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్
‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.
News February 2, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే జట్లివే: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు భారత్, ఆస్ట్రేలియా వెళ్తాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపారు. ఆ రెండు జట్లు చెరో రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. వీటికి పోటీగా హోంగ్రౌండ్స్ కావడంతో పాకిస్థాన్ రేసులో ఉంటుందన్నారు. ఈ జట్టు అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేస్తుందన్నారు. పాంటింగ్ వ్యాఖ్యలతో మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు.