News July 9, 2024
వైఎస్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు: నారాయణ

AP: YSR బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఆవిర్భవించి ఉండేది కాదు. రాజకీయాల్లో YSR విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం చేసేందుకు ముందుండేవారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
DANGER: పబ్లిక్ వైఫై వాడుతున్నారా?

పబ్లిక్ వైఫై సేవలు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘అత్యవసరమైతేనే వైఫై వాడండి. అపరిచిత వెబ్‌సైట్స్‌కు సంబంధించిన పాప్అప్‌ను పట్టించుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయండి’ అని పిలుపునిచ్చారు.
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.
News December 6, 2025
స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *


