News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం

image

రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. రైతులు సాగు చేసినా వరి పంటతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఎదురుగా కూడిన వడగళ్ల వర్షం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంతో పాటు రెడ్డి పేట, పోసానిపేట గ్రామాలలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Similar News

News January 26, 2026

దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపేందుకు అందరు సహకారం అందించాలన్నారు.

News January 26, 2026

నిజామాబాద్: కొందరికే భరోసా

image

భూమిలేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో గతేడాది ఇదే రోజు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో 38,787 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా కేవలం 1,675 మందికే తొలి విడత సాయం అందింది. ఇంకా 37,112 మంది ఎదురుచూస్తున్నారు. ఏడాది గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో అర్హులైన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 26, 2026

రిపబ్లిక్ డే వేడుకకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.