News March 30, 2024
ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
Similar News
News January 22, 2026
Republic day Special: మేడం బికాజీ కామా

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.
News January 22, 2026
OTTలోకి కొత్త సినిమాలు

ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు కొత్త సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలోకి రానున్నాయి. ధనుష్, కృతిసనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) నెట్ఫ్లిక్స్లో, కిచ్చా సుదీప్ ‘మార్క్’ జియో హాట్స్టార్లో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ’45’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శోభితా ధూళిపాళ్ల ‘చీకటిలో’ రానుంది. ఇదే ప్లాట్ఫామ్లో ‘మోగ్లీ’ అందుబాటులోకి వచ్చింది.
News January 22, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్కు 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది.


