News April 15, 2024

ఏపీకి వడగాలుల అలర్ట్

image

వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ నంద్యాల(D) గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం(D) తుమ్మికపల్లిలో43.3 డిగ్రీలు, ఆముదాలవలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది.

Similar News

News February 1, 2026

NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మధ్యప్రదేశ్ సెహోర్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<>NIMHAR<<>>) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MDRA, PGDEI, PGDRP, MASLP, డిగ్రీ+DISLI, పీజీ(డిజాబిలిటీ/సోషల్ సైన్స్), MD(పీడియాట్రిక్స్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nimhr.nic.in

News February 1, 2026

‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

image

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.

News February 1, 2026

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రిషబ్ శెట్టి

image

కాంతార సినిమాలతో పాపులర్ అయిన రిషబ్ శెట్టి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు రూ.80కోట్లు అడుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందే పీరియాడిక్ డ్రామాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.