News October 28, 2024

HAIR HEALTH: ఇవి పాటిస్తే సొగసైన జుట్టు మీ సొంతం

image

* జుట్టుకు ప్రొటీనే బలం. అందుకు మాంసం, ఫిష్, బీన్స్, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు తీసుకోవాలి * జుట్టు రాలొద్దంటే జింక్ ఉండే వెజిటెబుల్స్, ఫ్రూట్స్, ఆకు కూరలు, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి * మాడుపై ఫొలిసిల్స్, సెబాస్టియన్ గ్రంథులకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అప్పుడే జుట్టు రాలడం తగ్గుతుంది * మీ హెయిర్‌టైప్ డ్రై, ఆయిలీనా తెలుసుకోవాలి * తగిన షాంపూ, కండిషనర్ సరైన మోతాదుల్లోనే వాడాలి.

Similar News

News February 26, 2026

భారత్ నేరుగా సెమీస్‌ చేరాలంటే..

image

T20WC: నేడు వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్‌కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.

News February 26, 2026

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

image

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.

News February 26, 2026

తీర్థం ఎందుకు తీసుకోవాలి?

image

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.