News February 9, 2025
దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు

AP: విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుక కనిపించడం కలకలం రేపింది. ప్రసాదంలో నాణ్యత లేదని ఓ భక్తుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్ పెట్టాడు. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డూలోనూ వెంట్రుకలు ఉండటంతో తాను నిర్ఘాంతపోయినట్లు అతడు మంత్రి ఆనంను ట్యాగ్ చేశారు. స్పందించిన మంత్రి భక్తుడికి క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే ఆలయాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు.
Similar News
News March 23, 2026
షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.
News March 23, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.
News March 23, 2026
ఈ నెల 28 వరకు వర్షాలు!

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది.


