News July 11, 2024
ట్రైన్లలో ‘హలాల్ ఫుడ్’ ప్రచారం ఫేక్: IRCTC

హలాల్ గుర్తింపు పొందిన ఉత్పత్తులను రైల్వేశాఖ ప్రయాణికులకు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారంపై IRCTC స్పందించింది. ఎవరూ దీన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ఫుడ్ సప్లయ్ కోసం తమకు కేవలం FSSAI సమ్మతి మాత్రమే అవసరమని స్పష్టం చేసింది. హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులను తనకు సప్లయ్ చేశారంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరలవగా IRCTC ఇలా స్పందించింది.
Similar News
News December 8, 2025
జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.
News December 8, 2025
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.
News December 8, 2025
ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.


