News December 12, 2024
అర్ధ సంవత్సర పాలన అర్థ రహితం: షర్మిల
AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 13, 2024
గుకేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ
18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుతమైన విజయం అందుకున్నందుకు తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసినందుకు శుభాకాంక్షలు అని డైరెక్టర్ రాజమౌళి, మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి గ్రాండ్ సెల్యూట్ అంటూ హీరో ఎన్టీఆర్, తదితరులు గుకేశ్‌ను అభినందించారు.
News December 13, 2024
TODAY HEADLINES
☛ వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా భారత ప్లేయర్ గుకేశ్
☛ జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
☛ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. 12 మంది మావోల మృతి
☛ లగచర్ల రైతుకు బేడీలు.. సీఎం రేవంత్ ఆగ్రహం
☛ ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో భేటీ
☛ ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్
☛ తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు: సీఎం చంద్రబాబు
☛ వైసీపీకి గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ రాజీనామా
News December 13, 2024
రేపు, ఎల్లుండి పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ
రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదిక కానుంది. ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాజ్యాంగంపై ఇరు సభల్లో చర్చ జరగనుంది.