News April 13, 2025
నేటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్స్

TG: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 6,835 సీట్లకు గానూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.
Similar News
News December 8, 2025
భారత్‌కు గుడ్‌న్యూస్.. గిల్ ఎంట్రీ పక్కా!

మెడ నొప్పి వల్ల SAతో టెస్టులు, వన్డేలకు దూరమైన గిల్ T20లతో తిరిగి జట్టులో చేరేందుకు రెడీ అయ్యారు. రేపట్నుంచి SAతో 5మ్యాచుల T20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకున్నారు. BCCI CoEలో గిల్ ఫిట్నెస్ సాధించినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. విశాఖలో చివరి వన్డే తర్వాత గంభీర్ కూడా దీన్ని ధ్రువీకరించగా గిల్ ఎంట్రీ పక్కా కానుంది. హార్దిక్ సైతం రీఎంట్రీ ఇస్తుండటంతో జట్టు బలం పెరిగింది.
News December 8, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


