News January 7, 2025
వెండి నగలకూ హాల్ మార్కింగ్!
బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.
Similar News
News January 8, 2025
LRS పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్
TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.
News January 8, 2025
PMతో ప్రత్యేకహోదా ప్రకటన చేయించండి: షర్మిల
AP: విశాఖ వస్తున్న PM మోదీతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ‘చంద్రబాబు గారూ మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని PMతో పలికించండి’ అని ట్వీట్ చేశారు.
News January 8, 2025
రైళ్లలో వెళ్లేవారు ఈ నంబర్ సేవ్ చేసుకోండి!
పండుగ సందర్భంగా ప్రజలు రైళ్ల ద్వారా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ట్రైన్లలో వెళ్లేవారు తప్పనిసరిగా ఓ నంబర్ సేవ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9881193322ను సేవ్ చేసుకొని వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. ఇందులో PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ షెడ్యూల్ & కోచ్ పొజిషన్, ముఖ్యంగా ట్రైన్‌లో ఎవరైనా ఇబ్బందిపెడితే రైల్ మదద్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అధికారులు వస్తారు. SHARE IT